Allu Arjun remuneration for Pushpa 2:
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికం విషయంలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొన్ని వర్గాలు ఆయన రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నారని చెబుతున్నాయి, మరికొన్ని వర్గాలు రూ. 100 కోట్లు మాత్రమే కాకుండా లాభాల్లోనూ వాటా ఉందని చెబుతున్నాయి. అయితే, అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డారు.
ఈ టైంలో సాదారణంగా రెండు సినిమాలు చేసినా తక్కువ. ఈ మూడు సంవత్సరాల పని మీద ఆయన రూ. 200 కోట్లకు పైగా సంపాదించేవారు. అయితే, ప్రామాణిక సమాచారం ప్రకారం “పుష్ప 2” కోసం అల్లు అర్జున్ కేవలం పారితోషికం కాకుండా చిత్ర లాభాల్లో వాటా తీసుకోవడం జరిగింది. ఆయనకు సినిమా మొత్తం టర్నోవర్‌లో 27% లాభ వాటా వస్తుందట.
“పుష్ప 2” సినిమాకు ఇప్పటివరకు రూ. 1,000 కోట్ల పైగా వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన అల్లు అర్జున్ వాటా సుమారుగా రూ. 270 కోట్లుగా ఉంటుంది. “పుష్ప 2” ప్రొడక్షన్ కాస్ట్ సుమారుగా రూ. 500 కోట్లు అని అంచనా. మొత్తం ఖర్చులు తీరిన తర్వాత మిగిలిన లాభంలో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కూడా వాటాలు అందుకుంటారు.
“పుష్ప 2” సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు, ఆ సినిమా బ్రాండ్‌ను నిలబెట్టడంలో కూడా ఎక్కువ శ్రమించారు. ఆ కృషికి తగ్గట్టుగానే రూ. 270 కోట్ల భారీ పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా విజయంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది.
ఇంతకు ముందు అల్లు అర్జున్ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, పుష్ప సినిమా ఆయనకు దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చింది. ఆయన నటనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. “పుష్ప 2” విజయంతో ఆయన రేంజ్ ఇంకా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు.
Read More: Ghajini 2 సినిమా కోసం అల్లు అరవింద్ పెద్ద ప్లాన్ వేశారుగా!