HomeTelugu Trendingబన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్?

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 రిలీజ్ డేట్ ఫిక్స్?

Pushpaa 2 date
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ మెప్పించిన హీరో. టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా బడా హీరోగా సత్తా చాటుతున్నాడు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుండూ వస్తున్నాడు. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గాఎదిగిపోయాడు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డెరెక్షన్‌లో రూపొందిన మాస్ యాక్షన్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో పుష్ప వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

Allu Arjun

‘పుష్ప’ మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు సెకెండ్ పార్టుతో అల్లు అర్జున్ ‘పుష్ప.. ది రూల్’ అనే టైటిల్‌తో వస్తున్నాడు. ఈ చిత్రంలో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అనే విషయం హైలైట్. పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే రెండో భాగాన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు.

‘పుష్ప ది రూల్’ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో హైప్ ఉంది. ఇప్పటికే పార్ట్-2 షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. దాదాపు 40 శాతానికి పైగానే షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ముందుగా కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది.

Pushpa2 date

‘పుష్ప-2 కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పుష్ప మూవీకి అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ‘పుష్ప 2’ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప-2 మూవీ షూట్‌లో బన్నీ మరింత ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు.

పుష్ప-2 మూవీ రిలీజ్ డేట్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2023 డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందని అప్పట్లో అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఎన్నో చర్చల తర్వాత పుష్ప-2 మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2024 మార్చి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu