‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నిన్న (మార్చి11)న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక‌్షన్లను రాబడుతోంది. ఈ సినిమాకి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతిరత్నాలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘నిన్న రాత్రి జాతిరత్నాలు చూశాను. నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించాడు. అప్‌కమింగ్ హీరోగా నవీన్ నటన ఆకట్టుకుంటుంది. రాహుల్ చాలా సునాయసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా నటన ఎంతో ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్, స్వప్నా దత్, ప్రియాంక దత్‌లకు అభినందనలు, రథన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషిన్లందరికి నా అభినందనలు. ఇక చివరగా డైరెక్టర్ అనుదీప్‌కి మా అందరిని ఇంత బాగా నవ్వించినందుకు స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు.
Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven’t laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless.
— Allu Arjun (@alluarjun) March 12, 2021