HomeTelugu Big Storiesబన్నీకి నచ్చలేదట!

బన్నీకి నచ్చలేదట!

‘సరైనోడు’ సినిమా సక్సెస్ తరువాత అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు, పోస్టర్స్ బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతోంది. అభిమానులు ఫస్ట్ లుక్, టీజర్ కోసం
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను ఈ నెల 24 న విడుదల చేయనున్నట్లు హరీష్ చెప్పారు. టీజర్ ను కూడా సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు హరీష్.

అయితే ఆ టీజర్ మాత్రం బన్నీకు అసలు నచ్చలేదట. తాను మరింత స్టైలిష్ గా కనిపించే విజువల్స్ తో కూడిన టీజర్ ను కట్ చేయమని హరీష్ కు చెప్పాడట అల్లు అర్జున్. దాంతో హరీష్ శంకర్ ఇప్పుడు ఆ పనిలో పడ్డాడని తెలుస్తోంది. మరి ఈసారైనా హరీష్, అల్లు అర్జున్ కు నచ్చే విధంగా టీజర్ ను రెడీ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu