HomeTelugu Big StoriesAllu Arjun: పుష్ప 2 మీదే దృష్టి పెట్టిన అల్లు అర్జున్ జేబులు ఖాళీనా?

Allu Arjun: పుష్ప 2 మీదే దృష్టి పెట్టిన అల్లు అర్జున్ జేబులు ఖాళీనా?

Allu Arjun lineup disappoints the fans
Allu Arjun lineup disappoints the fans

Allu Arjun Upcoming Movies:

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా కనీసం మొదలుపెట్టకముందే మరొక సినిమా సైన్ చేసేస్తున్నారు. విజయ్ దేవరకొండ, ప్రభాస్ చేతుల్లో చాలానే సినిమాలు ఉన్నాయి. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం ఫాన్స్ కొంచెం నిరాశ చెందుతున్నారు అని చెప్పుకోవాలి.

పుష్ప 2:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో ఈ సినిమాకి రెండవ భాగంగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాచేలా ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అసలైతే ఆగస్టులో విడుదలకు కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6 కి వాయిదా పడింది. అప్పటికైనా సినిమా విడుదలవుతుందా లేదా అని అభిమానులు కంగారుపడుతున్నారు.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్:

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. అవే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప 2 సినిమా విడుదల పక్కన పెడితే షూటింగ్ ఈ ఎడాది పూర్తయిపోతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతానికి అల్లు అర్జున్ చేతిలో కన్ఫామ్ అయిన సినిమాలు ఈ రెండే. అసలైతే అట్లీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలి. కానీ పుష్ప 2 వల్ల లేట్ అవుతుందనో లేక క్రియేటివ్ విభేదాల వలనో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. మరొకవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమా ఉంటుంది అని పుకార్లు అయితే ఉన్నాయి.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ వాసు అల్లు అర్జున్ 4 ప్రాజెక్ట్ ఓకే చేసే అవకాశం ఉంది అన్నట్లు మాట్లాడారు. మరి ఆ ప్రాజెక్టులు ఏంటి ఎవరితో అనేది ఈ మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా పుష్ప 2 సినిమా తీసేస్తే అల్లు అర్జున్ జేబులో ఒకే ఒక్క సినిమా ఉంది అని ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu