Allu Arjun Latest Controversy:
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ముందు అల్లు అర్జున్ ఎప్పుడైతే.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లి మరి క్యాంపెయిన్ చేశారో.. అప్పటినుంచి నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. సొంత కుటుంబంలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా.. బన్నీ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం మెగా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మీద బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అది ఇంకా తగ్గలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ కి ఎప్పటినుంచో మంచి స్నేహితుడు అయిన బన్నీ వాసు.. తను నిర్మిస్తున్న ఆయ్ (aay) అనే సినిమా థీమ్ సాంగ్ విడుదలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న బన్నీ వాసుకి ఎదురైంది.
“మెగా అల్లు కుటుంబాలని నేను 20 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. కుటుంబ సభ్యులు ఎప్పుడూ కలిసే ఉండాలి అని చిరంజీవి ప్రతిక్షణం కోరుకుంటారు. అందుకే ప్రతి ఏడాది సంక్రాంతికి కుటుంబ మొత్తాన్ని తీసుకొని బెంగళూరు వెళ్తారు. అంతమంది స్టార్లను ఒకేసారి తీసుకొని వెళ్లడం మామూలు విషయం కాదు. ఏ ఫామిలీ అయినా ఒకలు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్నిసార్లు వేరే వాళ్ళకి సమస్యలు వస్తాయి. అలా అని వాళ్ళ మధ్య బంధం తెగిపోయినట్లు కాదు. ఇవన్నీ వాళ్ళకి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. వాటిని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య అనుబంధం గురించి బాగా తెలిసిన వాడిగా చెబుతున్నాను. మేమంతా ఒక్కటే అని చెప్పడానికి వాళ్లకి ఒకే ఒక్క సందర్భం చాలు” అని స్పష్టం చేశారు బన్నీ వాసు.
2019 లో పాలకొల్లు నుంచి తనని పోటీ చేయమని పవన్ తనని అడిగారు అని ఓడిపోయిన పర్వాలేదు ముందడుగు వేయిమన్నారు అని చెప్పారు బన్నీ వాసు. “కానీ నేను ధైర్యం చేయలేకపోయాను. 2024 ఎన్నికల సమయంలో కూడా కలిసినప్పుడు అల్లు అరవింద్ గారితో మాట్లాడి చెబుతాను అని అన్నాను. నీ అంతట నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నన్ను సంప్రదించు అని చెప్పారు” అని అన్నారు బన్నీ వాసు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు.