టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ‘రౌడీ’ అనే బ్రాండ్ పేరుతో విజయ్‌దేవరకొండ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ దుస్తులు చూసి ‘నీ ‘రౌడీ’ వేర్ బాగుంది. మరి నాకెప్పుడు పంపిస్తున్నావ్’ అని బన్నీ సరదాగా అడిగారట. దీంతో విజయ్.. ‘నేనే స్పెషల్‌గా డిజైన్ చేసి మీకోసం పంపిస్తాను అన్నా’ అని చెప్పారట. ఈ మేరకు ‘అల..వైకుంఠపురములో’ విడుదల రోజు విజయ్.. బన్నీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి రెండు ‘రౌడీ’ టీషర్ట్స్ పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసిన బన్నీ.. ‘థ్యాంక్యూ విజయ్. మాటిచ్చినట్లుగానే నాకోసం నువ్వే ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేసి పంపించినందుకు ధన్యవాదాలు. తప్పకుండా వీటిని ధరిస్తాను.’ అని ఆ సమయంలో మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా బన్నీ తన కుటుంబసభ్యులు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతికి వెళ్లే సమయంలో ఆయన విజయ్ దేవరకొండ ఇచ్చిన పసుపు, నలుపు రంగులో ఉన్న టీ షర్ట్‌ను ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ‘విజయ్‌కి ఇచ్చిన మాటను బన్నీ నిలబెట్టుకున్నారు.’, ‘రౌడీ వేర్‌లో బన్నీ’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.