స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘన స్వాగతం లభించింది. సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి కాకినాడ నగరానికి చేరుకున్న బన్నీకి అభిమానులు స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అచ్చంపేట కూడలి నుంచి సరోవర్ పోర్టికో హోటల్ వరకూ అభిమానులు ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రధాన కూడళ్లలో వాహనంపై నుంచి అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బన్నీ బస చేయనున్న సరోవర్ పోర్టికో వద్ద అభిమానుల సందడి కనిపించింది. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం నగరానికి వచ్చిన స్టార్ హీరో కొన్ని రోజులపాటు సరోవర్ పోర్టికోలోనే బస చేయనున్నట్టు సమాచారం.
తన తర్వాతి సినిమా షూటింగ్ నిమిత్తం బన్నీ కాకినాడకు వెళ్లారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ 19వ సినిమాగా తెరకెక్కతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించింది.
500+ bikes rally 🤘🏻🥁
Video will be out soon!#AAArmyWelcomesAlluArjun #AAArmyKakinada #AlluArjun ❤ pic.twitter.com/KIRRhe8ebf
— TeamAlluArjun ™ (@RakeshSanjuAAFF) July 31, 2019