HomeTelugu Trendingమరోసారి అల్లు అర్జున్ కూతురి అల్లరి‌.. వైరల్‌

మరోసారి అల్లు అర్జున్ కూతురి అల్లరి‌.. వైరల్‌

1 1
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యామిలీతో సరదాగా గడుపుతారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్నీ కుమార్తె అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంత ఇంత కాదు. గతంలో ‘రాములో.. రాములా’ పాటలో బన్నీ డ్యాన్స్‌ను దోశ స్టెప్పు అర్హ అన్న సంగతి తెలిసిందే.. మరోసారి తన అల్లరితో నవ్వులు పూయించింది. తాజాగా అర్హతో సరదాగా గడిపిన ఓ వీడియోను బన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అర్హను బన్నీ నీ ఫెవరేట్‌ కలర్‌ ఏంటి బే అని అడగ్గా.. అందుకు అర్హ పింక్‌ ‘బే’ అని చెప్పింది. వెంటనే నన్ను ‘బే అంటావా బే’ అని బన్నీ ప్రశ్నించగా.. అర్హ మరింత అల్లరిగా అవును బే అని నవ్వసాగింది. దీనికి బన్నీ ‘కన్నతండ్రిని నన్ను బే అంటావా’ అంటూ కుమార్తెను ప్రేమగా హత్తుకున్నాడు. బన్నీ ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనికి ఫాదర్‌ డాటర్‌ లవ్‌, జస్ట్‌ ఫర్‌ పన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను బన్నీ జత చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu