HomeTelugu Trendingఅల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా - స్నేహా రెడ్డి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా – స్నేహా రెడ్డి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Allu

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అల్లుడిగా బన్నీకి 100 మార్కులు వేస్తానని అన్నారు. అల్లు అర్జున్ కట్నం ఎంత తీసుకున్నారు అని ప్రశ్నించగా చంద్రశేఖర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ అసలు కట్నమే తీసుకోలేదు.. ఆ అవసరం కూడా లేదు. వాళ్ళకే ఎంతో ఆస్తులు ఉన్నాయి. మనం ఇచ్చేది వాళ్ళకి లెక్క కూడా ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే కట్నం తీసుకోవడం అల్లు అర్జున్ కి ఇష్టం లేదు. దానికి వాళ్ళు వ్యతిరేకం అని చంద్రశేఖర్ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu