స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని మేటర్ హార్న్ మంచు కొండల్లో దిగిన ఫొటోలను బన్నీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన సతీమణి స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో కలిసి నవ్వుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘లైఫ్‌లో ఎలా ఉండాలి?’ అంటే.. వారన్నారు ‘హ్యాపీ గా…’ అని పోస్ట్ చేశారు. అయాన్‌ను స్ట్రోలర్‌పై తీసుకెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘డాడీ కూల్’ అని రాశారు.
బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాస్తున్నట్లు ఇటీవల తమన్ పేర్కొన్నారు. బన్నీ ట్రిప్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.