HomeTelugu Big Storiesబన్నీ సినిమా వచ్చేది అప్పుడే!

బన్నీ సినిమా వచ్చేది అప్పుడే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింఫ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఈ సినిమాకు సంబంధించి ఓ అగ్రహారం సెట్ కూడా వేశారు. బ్రాహ్మణ యువకుడిగా బన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మే 19న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే నెలలో బాహుబలి 2 సినిమా రిలీజ్ అవుతుండడంతో డిజె వెనుకడుగు వేశాడు. బాహుబలి మేనియా తగ్గడానికి కనీసం నెలరోజులైనా.. పడుతుంది. అందుకే కాస్త వెనక్కి వెళ్ళి సమ్మర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. దీని ముందు వెనుక మరో సినిమా లేకుండా ఆలోచింది.. ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్లు టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu