HomeTelugu Trending'బుట్టబొమ్మ' మరో రికార్డు..

‘బుట్టబొమ్మ’ మరో రికార్డు..

8 2
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమా పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏ స్తాయిలో హిటైయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ స్థాయిలో ఈ సినిమా విజయం సాధించడానికి ప్రధాన కారణం థమన్ అందించిన పాటలు. ఈ ఆల్బమ్ కు రెండు రాష్ట్రాల ప్రేమికులు ఫిదా అయ్యాపోయారు.

ఇందులోని ప్రతి సాంగ్ ఓ అద్భుతం, ఓ రికార్డ్ అనే చెప్పాలి. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్. దీనికి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ నెల రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో రిలీజైనప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే ఉన్నది. ఇప్పటి వరకు 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. లిరికల్ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ కలుపుకుంటే మొత్తం 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. అంతేకాదు, రాములో రాములా లిరికల్ సాంగ్ 240 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటే, సామజవరగమన సాంగ్ 178 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక సినిమాలోని పాటలు ఈ స్తాయిలో వ్యూస్ ను సొంతం చేసుకోవడం కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu