HomeTelugu TrendingAllu Arjun: అల్లు అర్జున్ మీద ఇంత ద్వేషం న్యాయమా..

Allu Arjun: అల్లు అర్జున్ మీద ఇంత ద్వేషం న్యాయమా..

allu arjun
Allu Arjun being intentionally targetted by mega fans

Allu Arjun Mega Family Controversy: ఎన్నికల కి ముందు అల్లు అర్జున్ వైఎస్సార్సీపీ కార్యకర్త శిల్పా రవికి సపోర్టుగా నంద్యాల వెళ్లి క్యాంపెయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన ఆరోజు అల్లు అర్జున్ వెళ్ళారో కానీ ఇప్పటిదాకా దాని వల్ల వచ్చిన నెగిటివిటీ మాత్రం పోలేదు. పవన్ కళ్యాణ్ కి కాకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తకి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులందరూ అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటినుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూనే వచ్చారు. అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేసి చాలా కాలం అయింది. ఎన్నికలు పూర్తయిపోయాయి. రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో గెలిచి రికార్డు సృష్టించింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసేసారు.

ఇంత జరిగింది కానీ అల్లు అర్జున్ మీద వస్తున్న ట్రోల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక మెగా అభిమాని అల్లు అర్జున్ మొహంతో ఒక గేమ్ కూడా డిజైన్ చేసేసాడు. ఇలా రోజురోజుకీ అల్లు అర్జున్ మీద కావాలనే కొందరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ ఏమి ఇండస్ట్రీలో చిన్న హీరో కాదు. ఎంత మెగా – అల్లు బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా నటుడిగా కూడా ఎదిగి టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు.

అలాంటి అల్లు అర్జున్ మీద ఇంత ద్వేషం ఎందుకు అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా అల్లు అర్జున్ మీద వచ్చే నెగెటివిటీ ఆపేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Allu Arjun Upcoming Movies:

సోషల్ మీడియాలో ట్రోల్స్ సంగతి పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. 2021 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu