HomeTelugu TrendingAllu Arjun: అల్లు అర్జున్ వద్దనడం వల్లే అట్లీ సినిమా క్యాన్సిల్ చేశారా

Allu Arjun: అల్లు అర్జున్ వద్దనడం వల్లే అట్లీ సినిమా క్యాన్సిల్ చేశారా

atlee
Allu Arjun Atlee movie shelved because of this reason

Allu Arjun Next Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ కోసం చాలామంది అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లితోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ మధ్యనే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన సంగతి తెలిసిందే.

అసలు సడన్ గా అల్లు అర్జున్ అట్లీల సినిమా ఎందుకు క్యాన్సల్ అయింది అనే విషయం మీద ఇప్పటికే ఎన్నో పుకార్లు బయటకు వచ్చాయి. కొంతమంది చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కి అట్లీకి మధ్య రెమ్యూనరేషన్ విషయంలో తేడాలు వచ్చాయని. అందుకే అట్లీ వాక్ అవుట్ చేశారని చెబుతున్నారు. మరి కొందరేమో అట్లీ అల్లు అర్జున్ మధ్య క్రియేటివ్ విభేదాలు వల్లే ఇలా అయింది అని చెబుతున్నారు.

తాజాగా ఇప్పుడు ఈ విషయంలో మరొక కోణం బయటకు వచ్చింది. అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ అయిపోయిన వెంటనే అట్లీ సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అల్లు అర్జున్ తో చేయాల్సిన కథ సల్మాన్ ఖాన్ తో చేస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ తో పాటు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తారని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇది అల్లు అర్జున్ తో చేయాల్సిన కథ అయ్యుంటే అల్లు అర్జున్ కాకుండా మరొక స్టార్ హీరో కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మల్టీ స్టారర్ సినిమా చేయడం ఇష్టం లేక అల్లు అర్జున్ దానికి నో చెప్పి ఉండొచ్చు. అందుకని కూడా అట్లీ సినిమాని క్యాన్సిల్ చేసి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక అట్లీ సల్మాన్ ఖాన్ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Allu Arjun Pushpa 2:

మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ 6 కి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu