
Allu Arjun – Atlee Movie Breakeven:
అల్లు అర్జున్.. మాస్ స్టార్! అట్లీ.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్! ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడే AA22 X A6 పేరుతో ఓ భారీ సినిమా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో చూస్తే ఈ సినిమా ఓ కొత్త అంచులకు వెళ్తుందనే ఫీలింగ్ వస్తుంది. కానీ బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ సినిమాకి ఏకంగా 800 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇది రాజమౌళి ప్లాన్ చేస్తున్న 1000 కోట్లు ప్రాజెక్ట్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద సినిమా. దాంతో ఈ సినిమా సాధారణంగా హిట్ అయితే సరిపోదు. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇండియాలో 1600 కోట్లు కలెక్ట్ చేయాలి అంట!
ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా 1600 కోట్లు వసూలు చేయలేదు. ‘పుష్ప 2’ ప్రస్తుతం హయ్యెస్ట్ ప్రాజెక్ట్ – దాని బిజినెస్ 1265 కోట్ల వరకు ఉంది. దాంతో ‘అల్లు అర్జున్-అట్లీ’ కాంబో సినిమా 1600 కోట్లు వచ్చేలాగా ఉండాలి అంటే.. అదిరిపోయే మాస్ అప్పీల్ ఉండాలి, రిపీట్ వ్యూయర్ ఉండాలి, ఒక్క స్క్రీన్ మీద కూడా డల్ ముమెంట్స్ ఉండకూడదు.
RRR, జవాన్, లియో, పుష్ప లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో వర్కౌట్ అవ్వడం చూసాక ఇప్పుడు మార్కెట్ చాలా పెరిగింది. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్, పుష్ప ఫేం ఉన్నా, అట్లీకి షారుక్ లాంటి స్టార్లతో హిట్లు ఉన్నాయి. వాళ్ల కాంబినేషన్ మీద నమ్మకం ఉంది. కానీ 1600 కోట్లు అంటే అసలు కథే వేరుగా ఉంటుంది.
ఇది సాధ్యం కాదనలేం. కొన్ని సంవత్సరాల క్రితం 1000 కోట్లు కూడా అసాధ్యం అనిపించింది. కానీ బాహుబలి తర్వాత దాన్ని రాజమౌళి బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే రేంజ్‌ని బన్నీ-అట్లీ దాటి పోతారా? ఈ సినిమా ఇండియన్ సినిమా ఫ్యూచర్‌ని నిర్ణయించేంత పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందా లేదా చూడాలి.