వింక్ సన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ చిత్రం ‘ఒరు అదార్ లవ్’. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం చిత్ర ఆడియో వేడుకను భారీస్థాయిలో నిర్వహించాలని హక్కులు కొన్న సుఖీభవ సినిమా సంస్థ ప్లాన్ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ వేడుక జరగనుంది. దీనికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వినిసిస్తున్నాయి. దీంతో అందరిలోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.