స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అనేక సార్ట్ కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీతెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు.
1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దీనికి సంబంధించిన యాడ్ ను విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న శ్రీచైతన్య వారు నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థ తమ కళాశాలల ప్రచారం కోసం ఒక ప్రముఖ సినీ నటుడిని ఎంపిక చేసుకోవడం ఇదే మొదటిసారి. అలాగే విద్యా రంగంలో అల్లు అర్జున్ మొదటి కమర్షియల్ యాడ్ కూడా ఇదే.