HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ సినిమా షురూ

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా షురూ

1 13స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో శనివారం ఉదయం నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ క్లాప్‌ కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఏప్రిల్‌ 24 నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. కార్యక్రమంలో బన్నీ జోక్స్‌ వేస్తూ సందడి చేశారు. తమ అభిమాన హీరో కొత్త సినిమా ప్రారంభం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం #AA19Starts అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ పాత్రలో నటించబోతున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

బన్నీ గత ఏడాది సెప్టెంబరులో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్‌ అందుకోలేకపోయింది. జనవరిలో బన్నీ.. త్రివిక్రమ్‌ ప్రాజెక్టును ప్రకటించారు. తర్వాత ఆయన ‘ఐకాన్‌: కనబడుట లేదు’ అనే సినిమాలో నటించనున్నారు. దీనికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలోనూ బన్నీ నటించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయిక పాత్ర పోషించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu