అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతుల 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా భార్యతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు బన్నీ. స్టార్ హీరోగా బన్నీ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. టైం దొరికినప్పుడు కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు. బన్నీ, స్నేహెరెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు అయాన్, అర్ష.
పదో వార్షికోత్సవం సందర్భంగా దంపతులిద్దరూ తాజ్‌మహల్ వద్ద కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మన 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీ. ఈ పది సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇకముందు కూడా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలంటూ బన్నీ తన భార్యకు ప్రేమతో విషెస్ చెప్పారు. ఈ దంపతులకు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బన్నీ తాజా చిత్రం పుష్ప ఆగస్ట్ 13న విడుదలకు సిద్ధమవుతోంది.
Happy 10th Anniversary to us Cutie . What a wonderful journey of ten years … and many more to come ❤️ pic.twitter.com/d4g6X5at6A
— Allu Arjun (@alluarjun) March 6, 2021