టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్‌కు స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్‌లు హాజరయ్యారు. గోపీచంద్.. తన కుమారుడు వియాన్స్ మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ వేడుకలకు యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు, రామ్, తేజ, బోయపాటి శ్రీను, సంపత్ నంది, వంశీ పైడిపల్లి తదితర ప్రముఖులు హాజరయ్యారు. గోపీచంద్ ప్రస్తుతం చాణక్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.