HomeTelugu Trendingకూతుర్ని గుండెలపై నిల్చోని పెట్టుకున్న బన్నీ

కూతుర్ని గుండెలపై నిల్చోని పెట్టుకున్న బన్నీ

Allu arjun and his daughter
టాలీవుడ్‌ హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో సరదాగా గడుపుతుంటాడు. ఈ మధ్య హాలిడే ట్రిప్‌లో భాగంగా దుబాయ్‌కు‌ కూడా వెళ్లొచ్చాడు. ఇక షూటింగ్స్ నుంచి కాస్త గ్యాప్ దొరికితే చాలు లన అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటాడు. తన ముద్దుల పిల్లల పిక్స్, వీడియోస్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఇలాంటి ఓ క్యూట్‌ ఫొటోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో ఈ ఖాళీ స‌మ‌యాన్ని త‌న కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు బ‌న్నీ. ఈ క్రమంలో తన ముద్దుల కూతురు అర్హ.. తండ్రి అల్లు అర్జున్ గుండెల‌పై నిల్చుని ఆడుకుంటున్న ఫొటోను స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటో బన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘తండ్రి ప్రేమ కంటే విలువైనది ఏముంది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

https://www.instagram.com/p/CN638t9DI-O/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu