HomeTelugu Newsఅల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

13 14స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో అంటూ విడుదల చేసిన పోస్టర్‌, అల్లు అర్జున్‌ డైలాగ్‌ ఎంతగా వైరల్‌ అయిందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్‌ తీసుకున్న బన్నీ.. తనపై వచ్చే ప్రశ్నలన్నీంటికి ఒక్క డైలాగ్‌తో పంచ్‌ వేసినట్టు ఫుల్‌ ఫేమస్‌ అయింది.

ఫుల్‌ స్పీడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా పాటలను విడుదల చేసేందకు రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది. మామూలుగా అయితే వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తాడని అందరూ అనుకుంటారు. కానీ, ఈ చిత్రానికి థమన్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ మూవీలోని పాటలు విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సిద్థంగా ఉందని తెలుస్తోంది. పూజా హెగ్డే, టబు, నవదీప్‌, సుశాంత్‌, సునీల్‌ లాంటి తారాగణం నటిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్‌,హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu