HomeTelugu Newsఅల్లు అర్జున్‌ "ఐకాన్" పై క్లారిటీ..

అల్లు అర్జున్‌ “ఐకాన్” పై క్లారిటీ..

12 5
ఈ రోజు టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన 21వ సినిమాకు సంబంధించి అందరికి క్లారిటీ వచ్చేసింది. బన్నీ 20 వ సినిమా సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తన తరువాత సినిమా శ్రీరామ్ వేణు దర్శకత్వం లో చేస్తున్నారు. ఈ సినిమా పేరు “ఐకాన్” కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్ .
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది మూవీ యూనిట్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌, మిగితా నటీనటులు వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ రోజే బన్నీ 20 వ సినిమా కు సంబంధించిన పోస్టర్ అలాగే సినిమా టైటిల్ కూడా విడుదల అయింది. ఇక బన్నీ కి సంబంధించిన రెండు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు రావడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu