అల్లు అర్జున్ ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం కొన్ని సార్లు ఈ హీరో చాలా అనుకోవగా ఉండగా.. మరికొన్నిసార్లు మాత్రం అహంకారంగా మాట్లాడదాం. అదేదో సినిమాలో అపరిచితుడు లాగా.. ఒక్కో టైం లో ఒక్కోలా ప్రవర్తిస్తుంటాడు ఈ హీరో.
కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్, చిరంజీవి వల్లే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామంటూ ఎన్నో కామెంట్స్ చేశారు. అసలు చిరంజీవి.. పవన్ కళ్యాణ్ లేకపోతే తానులేను అన్నట్టు మాట్లాడారు. అదే అల్లు అర్జున్ కొన్ని సూపర్ హిట్లు రాగానే.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రో అనే స్టేజ్ కి ఎదిగారు.
అక్కడి నుంచే అల్లు అర్జున్ ప్రవర్తన తీరు పవన్ అభిమానుల్లో అనుమానాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత కూడా ఇలాంటివి ఎన్నో సీన్స్ రిపీట్ అయ్యాయి. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుంటూ కనిపించారు. మరికొన్నిసార్లు అసలు పవన్ కళ్యాణ్ ని పట్టించుకోనట్లు తన ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ప్రవర్తించారు. ఇక ఈ మధ్య ఎన్నికల సమయంలో.. పవన్ కళ్యాణ్ కి ట్వీట్ పెట్టి.. మరో పక్క పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ లో ఉండే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి నంద్యాల కి వెళ్ళారు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా నాగబాబు దీనిపైన ఇన్ డైరెక్ట్ గా కొంచెం ఘాటుగా స్పందించాడు.
మొత్తానికి ఒక నిమిషం ఒకలా.. మరో నిమిషం మరోలా ప్రవర్తిస్తూ వచ్చారు ఈ ఐకానిక్ స్టార్. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ తరువాత.. అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్ గా నిలిచాడు. కూటమిలో భాగంగా…21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. సీఎం చంద్రబాబు అయినా కానీ తప్పకుండా పవన్ కళ్యాణ్ కి కూడా టిడిపి పార్టీలో మంచి గౌరవమే ఉంటుంది. కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు సినిమాలపరంగా.. గవర్నమెంట్ పరంగా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ విషయం గమనించో ఏమో తెలియదు కానీ అల్లు అర్జున్ పవన్ గెలిచిన వెంటనే పవన్ ని పొగుడుతూ ఒక ట్వీట్ వేశాడు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రో దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ని అభినందించే దగ్గర వరకు వచ్చారు ఈ హీరో. రియాలిటీ తెలిసి మన పుష్పాకి ఫైర్ తగ్గినట్టుందని.. అంతేకాకుండా పవన్ పవర్ అర్థం కావడంతో ఇక అల్లు అర్జున్ తప్పకుండా కంట్రోల్ లో ఉంటారని.. కామెంట్లు పెడుతున్నారు పవన్ అభిమానులు.