HomeTelugu Trendingకూతురితో అల్లు అర్జున్ అల్లరి

కూతురితో అల్లు అర్జున్ అల్లరి

9 9
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జుణ్‌ తన పిల్లలతో సరదాగా గడిపే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. వీడియోలు, తరచూ ఫొటోలు పోస్ట్ చేస్తుంటాడు. లాక్‌డౌన్ కారణంగా సుమారు 80 రోజులపాటు ఇంట్లోనే ఉన్న బన్నీ.. పిల్లలు అయాన్, అర్హలతో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా కుమార్తె అర్హతో అల్లు అర్జున్ బాగా ఆటలాడాడు.

అర్హ ముద్దుముద్దు మాట్లలకు బన్నీ మురిసిపోతుంటాడు. ఇప్పటికే అర్హకు సంబంధించి ఎన్నో వీడియోలను బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తాజాగా అటువంటి ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు బన్నీ. ‘‘అర్హలు.. నా బుజ్జి తల్లీలు.. నా బంగారు తల్లీలు.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?’’ అని బన్నీ అడిగితే.. దానికి అర్హ సిగ్గుపడుతూ ‘‘ఊహూ’’ అని సమాధానమిచ్చింది. ‘‘ఏంటి.. చేసుకుంటావా చేసుకోవా?’’ అని బన్నీ గట్టిగా అడిగేసరికి.. ‘‘చేసుకోను’’ అని అర్హ పరుగుపెట్టింది. బన్నీ ఏమో.. ‘‘చేసుకోవా, ఏయ్..’’ అంటూ సరదాగా ఆటపట్టించాడు.

అయితే, ‘‘నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లిచేసుకుంటావా’’ అని అర్హను బన్నీ అడగటం ఇది 374 సారి. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి వీడియో ఒకటి బన్నీ షేర్‌ చేశాడు. ఆ వీడియోలో కూడా తన కూతురితో ‘‘నాన్న చూపించిన అబ్బాయినే పెళ్లిచేసుకుంటాను’’ అని చెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, అర్హ మాత్రం చేసుకోను అనే చెప్పింది. అప్పటి నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. కానీ, అర్హ మాత్రం నో అంటోందట. అయినప్పటికీ, నాన్న ట్రయల్స్ మాత్రం ఆగవంటున్నాడు అల్లు అర్జున్‌.

View this post on Instagram

Attempt number #374 #nanatrails 💖

A post shared by Allu Arjun (@alluarjunonline) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu