స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టెప్పులు వేస్తే వెండితెర షేక్ అవ్వాల్సిందే. ఇలా తన స్టైల్, డ్యాన్స్‌తో కోట్లాది మంది ఆదరణ పొందిన హీరో బన్నీ. అయితే అల్లు అర్జున్ వేసింది దోశ స్టెప్పని ఆయన ముద్దుల కుమార్తె అర్హ చెబుతోంది. పాప క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న వీడియోను స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘దోశ స్టెప్’ అని పగలబడి నవ్వుతున్న ఎమోజీనీ షేర్ చేశారు. ఇందులో బన్నీ కుమార్తెతో మాట్లాడుతూ కనిపించారు. ‘నాన్న సినిమా పేరేంటి?’ అని అడిగితే.. ‘అల వైకుంఠపురములో..’ అని, ‘అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని సాంగ్ చేస్తాడు కదా.. అది ఏ సాంగ్?’ అంటే ‘రాములో రాములో..’ అని పాప జవాబిచ్చింది. అందులో ఏ స్టెప్పు వేశానని అడిగితే.. ‘దోశ స్టెప్ అంటూ..’ రెండు చేతులూ తిప్పుతూ డ్యాన్స్ చేసింది.
ఈ చూడచక్కని వీడియోకు తెగ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. బన్నీ ముద్దుపెట్టుకుంటున్న ఎమోజీని షేర్ చేశారు. ‘బుగ్గల బంగారు’ అని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశారు. ‘హాహాహా.. టూ క్యూట్. దోశ స్టెప్’ అని సుశాంత్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం.