నందమూరి బాలకృష్ణ వరుస ఫ్యాషన్ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన తొలిసారి డిజిటల్ మీడియాలో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన హోస్ట్‌గా చేసిన ‘అన్ స్టాపబుల్’ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా చేయగలడా.. అనుకున్నవాళ్లంతా.. ఆశ్చర్యపడేలా.. తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి మైలేజీ ఇచ్చింది. దీంతో అల్లు అరవింద్ మరో ప్లానే వేస్తున్నాడు.
బాలయ్యతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య ఒప్పుకోవడమే.. ఆలస్యం.. ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తామని అన్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ నుండి సమంత, నాగ చైతన్య, రానా,వెంకటేష్ తదితరులు వెబ్ సిరీసులో నటిస్తున్నారు. బాలకృష్ణ ఈప్రపోజల్ కు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు