అల్లరి నరేష్ యువ హీరోలు ఎవరు చేయలేనన్ని సినిమాలు చేసేసి తనకంటూ ఓ గుర్తింపును
సంపాదించుకున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీస్ మొత్తం క్యూ కడతాయి.
సంవత్సరం క్రితం ఈ సుడిగాడు ‘విరూప’ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఓ కార్పొరేట్ హాస్పిట ఓ విరూప ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడం పట్ల అల్లరి నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తనంత అదృష్టవంతుడు ఎవరు లేరంటూ.. అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘సెల్ఫీరాజా’ సినిమా విడుదలయింది. ప్రస్తుతం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.