Allari Naresh: ఈవీవీ సత్యనారాయణ సూపర్ హిట్‌ల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ఒక్కటి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్లను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ను అల్లరి నరేష్ సినిమా కోసం పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
అల్లరి నరేష్ ఇటీవలే కీలక పాత్రలో నటించిన ‘నా సామి రంగ’ కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక వైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోలో హీరోగా నటిస్తున్నాడు నరేష్. కామెడీ జోనర్ నుండి ఈ మధ్య కాలంలో సీరియస్ కథలు, సీరియస్ పాత్రలు చేస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత కామెడీ సోలో హీరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఆ ఒక్కటి అడక్కు’ టైటిల్ పరిశీలిస్తున్నాట్లు టాక్. అయితే ఇప్పటికే ఈ టైటిల్‌తో ఒక సినిమా ప్రారంభం అయ్యింది. రామ్ అంకం దర్శకత్వంలో సినిమా రూపొందింది. షూటింగ్ పూర్తి అయ్యిందనే వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ నరేష్ సినిమాకి ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారు అంటూ వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ గురించి మనకు తెలిసిందే. దీంతో
ఆ టైటిల్ కి కచ్చితంగా నరేష్ పూర్తి న్యాయం చేస్తాడు అని అంటున్నారు.