నాంది మూవీ తర్వాత వేగం పెంచాడు అల్లరి నరేశ్. విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో సినిమా ఉగ్రం. ఇప్పటికే విడుదలైన ఉగ్రం మూవీ టీజర్‌తోపాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14న వరల్డ్‌వైడ్‌గా లాంఛ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు ఉగ్రం మూవీ టీమ్.
ఉగ్రం చిత్రాన్ని మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉగ్రం కొత్త లుక్ విడుదల చేశారు. అల్లరి నరేశ్ ఈ మూవీలో టైటిల్‌కు తగ్గట్టుగానే కనిపిస్తున్నాడు. ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్నాడు. కొత్త పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
ఉగ్రం చిత్రంలో మలయాళ భామ మిర్ణా మీనన్‌ది కీలక రోల్. ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల ఇస్తున్నాడు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు