అల్లరి నరేష్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేం సుబ్బు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుండగా.. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈ మూవీ శుక్రవారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ వేడుకకు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఈ వేడుకలో టాలీవుడ్ దర్శకులు మారుతి, బుచ్చిబాబు సనా దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
ఇక అల్లరి నరేశ్‌కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుంది. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ సినమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంది.