HomeTelugu Big Storiesభయపడుతూనే.. భయపెడతా..!

భయపడుతూనే.. భయపెడతా..!

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అల్లరి నరేష్.. ఈ సంవత్సరంలో ఆయన నటించిన ‘సెల్ఫీరాజా’ సినిమా ఒక్కటే విడుదలయింది. అయితే ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిసంబర్ 30న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. అల్లరి నరేష్ తో కాసిన్నిముచ్చట్లు..
వ్యక్తిగతంగా సంతోషంగా ఉన్నా..
ఈ సంవత్సరం వృత్తిపరంగా సంతోషంగా లేకపోయినా.. వ్యక్తిగతంగా చాలా సంతోషంగా గడిచింది. రీసెంట్ గా నాకు కూతురు పుట్టింది. ఆరోజు నా జీవితంలోనే గొప్ప రోజు. అందరూ పెళ్ళైన తరువాత బాధ్యతలు పెరుగుతాయని అంటారు కానీ నిజానికి పిల్లలు పుట్టిన తరువాతే బాధ్యతలు మొదలవుతాయి.
జోరు తగ్గించా..
నా సినిమాలు సంవత్సరానికి నాలుగైదు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు జోరు తగ్గించా.. ఎక్కువ సినిమాలు చేయడం కంటే మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను.
భయపడుతూనే భయపెడతా..
ఈ సినిమాలో పెళ్ళికి బ్యాండ్ వాయించే అబ్బాయి పాత్రలో కనిపిస్తా.. దెయ్యాలంటే పెద్దగా నమ్మనివాడు.. ఓ పెళ్లి ఇంట్లోకి దెయ్యాన్ని వదిలించడానికి మంత్రగాడిగా వెళ్లాల్సివస్తుంది. ఆ మంత్రగాడు భయపడుతూనే భయపెడతాడు.. 
సుడిగాడు బాధ పెట్టేసింది..
సుడిగాడు సినిమా నాకు ఎంత మేలు చేసిందో.. అంత బాధ పెట్టింది కూడా.. ఆ సినిమా తరువాత చేయబోయే సినిమా దానికి మించి ఉండాలని ఫైట్స్ లో ఎమోషన్స్ లో సెంటిమెంట్ లో ఇలా సినిమా మొత్తం కామెడీతో నింపేశారు. ఇంక కామెడీ కోసం కథ కాదు.. కథలో కామెడీ చేయాలని ఫిక్స్ అయ్యి ఈ సినిమా చేశాను.
మోడీ ఎఫెక్ట్ తో ఆగిన మొదటి సినిమా ఇదే..
మోడీ గారి పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ వల్ల రిలీజ్ ఆగిపోయిన మొదటి సినిమా మాది. నవంబర్ 12న సినిమా విడుదల కావాల్సింది. కానీ అప్పుడు రిలీజ్ చేసే పరిస్థితులు లేవు. ఆ తరువాత డేట్స్ క్లాష్ అవ్వడంతో డిసంబర్ 30న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం.
నన్ను భయపెట్టిన సినిమాలు..
ఈవిల్ డెడ్ సినిమా చూసి భయపడ్డాను. రీసెంట్ గా ‘డోంట్ బ్రీత్’ సినిమా త్రిల్ చేసింది.
కామెడీ చేయడం కష్టం..
ఆడియన్స్ అల్లరి నరేష్ అంటే కామెడీ అని ఫిక్స్ అయిపోయారు. దానికి భిన్నంగా లడ్డుబాబు, శంభో శివ శంభో వంటి సినిమాలు చేశాను. నేను ఎప్పుడు ఎక్స్ పెరిమెంట్ చేసినా.. ప్రేక్షకులు ఆదరించలేదు. కామెడీతో కూడిన ఎమోషన్ సినిమాలు పండాయి. నిజానికి అన్ని ఎమోషన్స్ లో కామెడీ చేయడమే కష్టం.
కథల విషయంలో జోక్యం చేసుకోను..
కథ నచ్చితేనే ఓకే చెప్పు.. ఒకసారి స్క్రిప్ట్ లాక్ చేసాక ఎలాంటి మార్పులు చేయొద్దని మా నాన్నగారు చెబుతుండేవారు. నేను పెర్శనల్ గా ఎలాంటి మార్పులు చేయను.
2020లో సినిమా చేస్తా..
2020 లో దర్శకుడిగా నా సినిమా మొదలు పెట్టి అదే సంవత్సరం మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు..
అనీల్ కృష్ణతో సినిమా ఫిబ్రవరి నెల నుండి మొదలవుతుంది. అలానే భీమనేని శ్రీనివాస్ గారితో సతీష్ అనే కొత్త దర్శకుడితో సినిమాలు ఓకే చేశాను. ఇవన్నీ పక్కన పెడితే 2017లో అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను.

Recent Articles English

Gallery

Recent Articles Telugu