HomeTelugu Trending'నాంది' సక్సెస్‌ కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్‌

‘నాంది’ సక్సెస్‌ కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్‌

Allari naresh emotional inఅల్లరి నరేష్‌ నటించిన తాజా చిత్రం ‘నాంది’ . శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్‌ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు నరేష్‌. ఇక చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చూడడంతో నరేష్‌ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేష్ ఎమోషనల్‌ అయి కనీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు.

2012 ఆగస్టులో ‘సుడిగాడు’ విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్‌ వేగేశ్న నమ్మి ప్రోత్సహించారు. సక్సెస్‌ అవుతుందో కాదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్‌ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్‌ అవుతుందో అనే టెన్షన్‌ ఉండేది. కానీ ప్రేక్షకులు అవేవి పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్‌ చేసి మెచ్చుకుంటున్నారు’ అని నరేష్‌ ఎమోషల్‌ అయ్యాడు. డైరెక్టర్‌ విజయ్‌ తనకు సెకండ్‌ బ్రేక్‌ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu