అల్లరి నరేష్ తాజాగా అతని 60వ సినిమా తెరకెక్కుతోంది. నాంది సినిమాతో తనకు భారీ విజయం అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడలతో మరోసారి సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. షాడో ఆఫ్ హోప్ అంటూ దీన్ని అల్లరి నరేష్ ట్వీట్ చేశాడు. రెండు చేతులకు సంకెళ్లు వేసి వున్న వాటి నీడ గోడపై పక్షిలా కనిపిస్తోంది.
ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది ఈ సినిమాలో నరేష్ మరో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. అల్లరి నరేశ్ ప్రస్తుతం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత తాజా చిత్రం షూట్ ప్రారంభించే అవకాశం ఉంది.
Wait for it…. @12.07pm today. @vijaykkrishna @sahugarapati7 @Shine_Screens pic.twitter.com/tw4Aio3bVC
— Allari Naresh (@allarinaresh) June 27, 2022