లాక్‌డౌన్ కారణంగా మూతపడిన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో కిషన్ రెడ్డి మాటాడుతూ.. షూటింగ్ ల కోసం త్వరలోనే అనుమతి లభిస్తుందని దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన అన్నారు. అంతర్జాతీయ సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్ లు , స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎం లతో మాట్లాడి సహాయం చేస్తానన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ, జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల ,అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు.