HomeTelugu Big StoriesSamantha: నిశ్చితార్థం నాగ చైతన్యది.. కానీ కళ్ళు మాత్రం సమంత మీదే

Samantha: నిశ్చితార్థం నాగ చైతన్యది.. కానీ కళ్ళు మాత్రం సమంత మీదే

All eyes on Samantha after Naga Chaitanya engagement
All eyes on Samantha after Naga Chaitanya engagement

Samantha about Naga Chaitanya Engagement:

చాలా కాలంగా నాగచైతన్య, గూడచారి ఫేమ్ హీరోయిన్ శోభిత ధూళిపాల ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు అధికారికంగా ప్రకటించక పోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వారి ఫోటోలు వైరల్ అవుతూనే వచ్చాయి. తాజాగా పుకార్లన్నిటికీ శుభం కార్డు పలుకుతూ.. ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది.

త్వరలోనే నాగచైతన్య, శోభిత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం మీద అందరికంటే ఎక్కువగా సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అని.. అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఏ మాయ చేసావే సినిమా సెట్స్ మీద కలుసుకున్న సమంత నాగచైతన్య 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే 2021లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత సమంతా రెండు మూడుసార్లు ఇన్ డైరెక్ట్ గా నాగచైతన్య మీద పంచులు వేసింది.

తాజాగా ఇప్పుడు నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత.. సమంత ఎలా రెస్పాండ్ అవుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య, శోభిత ధూళిపాల కంటే ఎక్కువగా.. సమంతా దీని గురించి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్టుగా కానీ.. పోస్ట్ ఏమైనా పెడతారా అని చూస్తున్నారు.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటిదాకా విడాకుల విషయంలో కేవలం సమంతని మాత్రమే తిట్టిపోసిన నెటిజన్లు కూడా ఇప్పుడు.. ఆమె మీద జాలి చూపిస్తున్నారు. మరోవైపు విడాకులు తర్వాత మనిషిగా చాలా స్ట్రాంగ్ గా మారాను అని పలు సందర్భాల్లో చెప్పిన సమంత.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu