వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన వర్మ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాలో కంగన నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
‘అద్భుతం.. కంగన ‘మణికర్ణిక’లో తన చక్కటి అభినయంతో నన్ను ఎంతో మెప్పించింది. ఇంత ప్రతిభను నేను చివరిసారిగా బ్రూస్‌లీ ఎంటర్ ది డ్రాగాన్‌లో చూశా. అతి గొప్ప హీరో కంగనను మిగిలిన యాక్షన్ హీరోలతో పోలిస్తే వారంతా హీరోయిన్లలా కనిపిస్తున్నారు’ అంటూ వర్మ తనదైన స్టైల్‌లో ట్వీట్లు చేశారు.
క్రిష్, కంగన ‘మణికర్ణిక’ చిత్రానికి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో ఈ సినిమా విడుదలైంది. తొలి రోజున దేశవ్యాప్తంగా రూ. 8.75 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందులో కంగన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రను పోషించారు. ఈ సినిమా కోసం ఆమె కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చుకున్నారు.
All action heroes look like heroines in comparison to the greatest hero I ever saw on screen #KanganaRanaut in #Manikarnika
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2019