HomeTelugu Trending10 రోజులకు 5 కోట్లు... హాట్‌ టాపిక్‌

10 రోజులకు 5 కోట్లు… హాట్‌ టాపిక్‌

5 8
రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ప్రతిష్టత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, ఆయన జోడీగా అలియా భట్ కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఈ సినిమా కోసం ఆమె అందుకోనున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న హీరోయిన్‌ల్లో అలియానే అని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu