బాలీవుడ్ నటి ఆలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్‌ను వదలి వెళ్లారు. రాజమౌళినే స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా పంపించారట. అదేంటబ్బా ఆలియా ఈ సినిమాలో నటిస్తున్నారు కదా ఆమె ఎందుకు వెళ్లిపోయింది అని అనుకుంటున్నారా.. మరేం లేదండి.. ‘ఆర్ ఆర్ ఆర్’లో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఆమెకు చిత్రబృందం గ్రాండ్ సెండాఫ్ ఇచ్చి సంతోషంగా ముంబయికి పంపించారట.
దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. సినిమాలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యముంటుందని సమాచారం. ఇప్పటికే 70శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఎన్టీఆర్ – ఒలీవియా మోరిస్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఇది పూర్తయిన వెంటనే క్లైమాక్స్ చిత్రీకరణను షురూ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర విడుదల తేదీను 2020 జులై 30గా ప్రకటించినప్పటికీ.. ఈ తేదీ మారే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. నూతన ఏడాది కానుకగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లు బయటకొచ్చే అవకాశాలున్నాయని చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి.