బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా.. మహేశ్ భట్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘సడక్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్ తన భార్య(పూజా భట్) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్, ఆదిత్యారాయ్ కపూర్‌ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్ల వరద కొనసాగుతోంది.
సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్ లైక్‌తో చిత్ర దర్శక, నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఈ ట్రైలర్ లైక్స్, డిస్ లైక్స్‌కు దాదాపు 80 శాతం తేడా ఉంది. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని, అంతేకాదు అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్ స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు.