దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపించనుండగా, ఈ అమ్మడి ఫస్ట్ లుక్‌కు టైం ఫిక్స్ చేశారు మేకర్స్. మార్చి 15న అలియా భట్ బర్త్‌డే కావడంతో ఆ రోజు ఉదయం 11గం.లకు సీత పాత్ర పోషిస్తున్న అలియా ఫస్ట్ లుక్ విడుదల కానుందని పేర్కొన్నారు. అలియా సీత పాత్రలో ఎలా కనిపిస్తుందోనని మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.