HomeTelugu Big Storiesఆలియా భట్ ఓటేయదట!

ఆలియా భట్ ఓటేయదట!

5 13ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు ఈసీ, అటు ప్రముఖులు భారీ ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆలియా భట్‌ మాత్రం ఓటింగ్ దూరంగా ఉంటానంటోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కళంక్‌’ చిత్రం ప్రచారంలో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చిత్ర బృందాన్ని ఓటింగ్ గురించి అడిగారు.

ఓటింగ్‌ గురించి తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా సదరు మీడియా కోరింది. దీనికి వరుణ్‌ ధావన్ స్పందిస్తూ..’మనమందరం ఓటేయాలి. దీన్ని హక్కుగా, బాధ్యతగా భావించాలి. మన దేశంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నేను కూడా బాధ్యతగా నా ఓటు వేస్తాను. మన విలువైన ఓటు ద్వారా ఉత్తమమైన నాయకులను ఎన్నుకోవాలి’ అని తెలిపారు. మన దేశంలో నాయకుడిని ఎలా ఎన్నుకుంటే బావుంటుంది? అని మీడియా ప్రశ్నించగా వరుణ్‌, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ముక్త కంఠంతో ఓటు ద్వారా అని చెప్పారు. తర్వాత మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా ఆలియాను ‘మీరిక్కడ ఓటేయడానికి వెళ్తారా?’ అని అడిగారు. అందుకు ఆలియా స్పందిస్తూ..’వెళ్లను’. అని చెప్పారు.

ఎందుకంటే ఆలియా పుట్టింది ముంబయిలోనైనా ఆమెకు మన దేశ పౌరసత్వం లేదు. ఆమె తల్లి సోనీ రజ్దాన్‌ది ఇంగ్లాండ్ కావడంతో ఆలియాకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉంది. ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ద్వంద్వ పౌరసత్వం ఉండటం నేరం. ఒకవేళ బ్రిటిష్‌ పౌరసత్వాన్ని ఆలియా వదులుకుంటే ఆమెకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ఓటింగ్‌ శాతాన్ని పెంచేలా యువతకు అవగాహన కల్పించాలని సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. బాలీవుడ్‌లోని కరణ్‌ జోహార్‌, అమితాబ్ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, భూమి పెడ్నేకర్‌, ఆయుష్మాన్‌ ఖురానా, ఆమిర్ వంటి ప్రముఖులను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu