HomeTelugu Trendingరాజమౌళిని అన్‌ఫాలో చేసిన ఆలియా భట్‌.. కారణం ఇదేనా!

రాజమౌళిని అన్‌ఫాలో చేసిన ఆలియా భట్‌.. కారణం ఇదేనా!

Alia bhatt unfollow rajamou

డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందించిన ఈ మల్టీస్టారర్‌ మూవీకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించి అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇదిలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఆలియా భట్‌ అస్సలు హ్యాపీగా లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా పాపులారిటీ ఉన్న ఆలియాకు స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇవ్వడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఈ కారణంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసినట్లు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అంతేకాకుండా సినిమా ఇంత పెద్ద సూపర్‌ హిట్‌ అయినా ఈ చిత్రానికి సంబంధించి థ్యాంక్యూ అంటూ ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదు.

గతంలో షేర్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి డిలీట్‌ చేసింది. కేవలం ఈ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ మినహా మిగతా పోస్టులను తన ఖాతా నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో తన రేంజ్‌కు తగిన పాత్ర దక్కలేదన్న అసంతృప్తి ఆలియాలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu