HomeTelugu Trendingఅలియాను కరోనా పాజిటివ్‌

అలియాను కరోనా పాజిటివ్‌

Alia bhatt tests corona pos
బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అలియా..తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నానని పేర్కొంది. ఈ సందర్భంగా తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఆలియా.. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గంగుభాయ్‌ కతియావాడి సినిమాలో నటిస్తుం‍ది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే స్వల్ప అస్వస్థతకు లోనైంది. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడనుంది. తెలుగులోనూ రాజమౌళి డైరెక్షన్‌ లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ అలియా నటిస్తుంది. గతంలో అలియా ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌కు సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోవిడ్‌ నుంచి బయటపడిన నేపథ్యంలో అలియాకు కరోనా సోకింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu