బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లో ఒకరిగా దూసుకుపోతుంది. ఇక గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సినిమాతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సీత పాత్రతో ప్రేక్షకుల్లో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. పైగా హిందీలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను భారీ స్థాయిలోనే ప్రమోట్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ హాలీవుడ్‌తో నాటు నాటు స్టెప్పులేయించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అలియాభట్ నటించిన హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ మరో మూడు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలో అలియా మూవీయూనిట్‌తో కలిసి ప్రమోషన్‌లు చేస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. ఆమె తెలుగులో మాట్లాడటమే కాదు, వండర్ ఉమెన్ గాల్ గాడోట్‌కి కూడా తెలుగు నేర్పించడం విశేషం. నిజానికి అలియాకు తెలుగులో వచ్చిందే రెండు, మూడు వ్యాఖ్యాలు.
వాటిలో అందరికీ నమస్కారం, అందరికీ ముద్దులు. ఈ రెండింటినే ఆమె గాల్ గాడోట్ కి కూడా నేర్పించడం విశేషం. అంతేకాకుండా ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాటకు గల్ గాడోట్‌తో స్టెప్పులేయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.