HomeTelugu Trendingప్రెగ్నెన్సీ వార్తలపై తొలిసారి స్పందించిన ఆలియా భట్‌

ప్రెగ్నెన్సీ వార్తలపై తొలిసారి స్పందించిన ఆలియా భట్‌

Alia bhatt strong reply to
బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఆలియా భట్‌. టాలీవుడ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడింది. పెళ్లి అయిన రెండు నెలలకే తల్లి కాబోతున్నానంటూ శుభవార్త చెప్పింది. కొందరు వారికి శుభాకాంక్షలు తెలిపితే మరికొందరు మాత్రం పెళ్లయిందో లేదో అప్పుడే గర్భవతి ఏంటని అని కామెంట్‌ చేశారు. తాజాగా దీనిపై ఆలియా స్పందించింది.

‘ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ అదో పెద్ద వార్త అవుతుంది. తను ఎవరినైనా ప్రేమించినా, డేటింగ్‌ చేసినా, తల్లి కాబోతున్నా, క్రికెట్‌ చూడటానికి వెళ్లినా, హాలీడే ట్రిప్‌కు వెళ్లినా.. ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తారు. ఒక మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాయింట్‌ అవుట్‌ చేస్తారు. నాది యుక్తవయసే. అయితే మాత్రం నాకు కుటుంబం ఉంటే, బేబీ పుడితే అది నా వృత్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అవి రెండూ వేర్వేరు. కొన్ని గొప్ప విషయాలు మనం ప్లాన్‌ చేసుకోనవసరం లేదు, అవి వాటంతటవే జరుగుతాయి. నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిందే చేస్తాను. పనికిమాలిన విషయాలపై దృష్టి పెట్టకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu