HomeTelugu Big Storiesలైవ్‌లో తెలుగు పాట పాడిన అలియా భట్‌!

లైవ్‌లో తెలుగు పాట పాడిన అలియా భట్‌!

alia
టాలీవుడ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. తాజాగా ‘బ్రహ్మాస్త్రం’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో అలియా భర్త రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించాడు. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 9న విడుదల కానుంది. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. గణేశ్ నిమజ్జనం ప్రారంభమైన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పడంతో ఈవెంట్ ను రద్దు చేసుకున్న చిత్ర బృందం… మీడియా సమావేశంలో పాల్గొంది. రణ్‌బీర్, అలియా, నాగార్జున, మౌనీరాయ్, నిర్మాత కరణ్ జొహార్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో అలియా తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అలియా లైవ్ లోనే ‘బ్రహ్మస్త్రం’ సినిమాలోని ‘కుంకుమలా’ అనే పాటను చాలా అందంగా ఆలపించింది. ఆమె గాత్రానికి భర్త రణ్ బీర్ అయితే అలా.. ఆమెనే చూస్తుండిపోయాడు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సినిమాలో సిధ్ శ్రీరామ్ ఆలపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu