HomeTelugu Trendingపుకార్లపై అలియా భట్ ఏమందో తెలుసా..?

పుకార్లపై అలియా భట్ ఏమందో తెలుసా..?

5 17

సెలబ్రిటీలు ఇద్దరు కలిసి తిరిగితే వారిపై పుకార్లు వ్యాపించడం సహజం. అది సినీ ఇండస్ట్రీలో అయితే కాస్త ఎక్కువే. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా అందులో కొంత నిజం ఉండే అవకాశమూ లేకపోలేదు. కొన్ని పుకార్లుగా మిగిలిపోయినా.. కొన్ని మాత్రం నిజమవుతాయి. అలాంటి పుకార్లను కొందరు నటులు ఎంజాయ్ చేస్తారు కానీ దానిపై ఎలాంటి స్పందన చూపించరు. తాజాగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించింది. ఇలాంటి పుకార్లను వినోదంగా భావిస్తానని తెలిపింది. బాలీవుడ్‌ ప్రేమజంట ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌ ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. ఆ సినిమా విడుదల తర్వాత వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ‘నాపై ఎప్పుడు ఎలాంటి పుకార్లు వస్తాయో నాకు తెలియదు. నా పెళ్లి గురించి అయితే ప్రతి మూడు వారాలకోసారి కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు పైగా ఇలాంటి పుకార్లను వినోదంగా భావిస్తానని తెలిపింది. మా మధ్య ఎలాంటి సంబంధం లేదు, కేవలం స్నేహం మాత్రమే అంటోంది అలియా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu