బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకి నెపోటిజం కారణం అని నెటిజన్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బంధుప్రీతి వలన అతని ప్రాణాన్ని అన్యాయంగా బలి తీసుకున్నరూ అంటు కొందరు మండిపడుతున్నారు. సుశాంత్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో అతను డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడగు పెట్టిన వారిని తొక్కేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
‘నెపొటిజం.. ఫేవరెటిజం’ చూపించే వారిని వ్యతిరేకించాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వారిని అన్ ఫాలో అవ్వాలంటూ కొందరు పిలుపునిచ్చారు. దాంతో చాలా మంది సెలబ్రెటీల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య తగ్గుతోంది. మూడు రోజుల్లో ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ లో 4.5 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 4.5 లక్షలు తగ్గడం జరిగింది. ఇక కరణ్ జోహార్ ఫాలోవర్స్ సంఖ్య 2 లక్షలు తగ్గింది. సల్మాన్ ఖాన్ అకౌంట్ ను 50 వేల మంది అన్‌ఫాలో అయ్యారు. ఇదిలా ఉండగా వారసత్వం ను మొదటినుంచి వెతిరేకిస్తున్న నటి కంగనా కు ఫాలోవర్స్ పెరిగారు.